కుకీ విధానం

బ్రౌజర్ కుకీ అనేది వెబ్‌సైట్‌లు మరియు మొబైల్ యాప్‌లు మీ గురించి విషయాలను గుర్తుంచుకోవడంలో సాయపడేందుకు మీ పరికరంపై నిల్వ చేయబడ్డ చిన్న డేటా భాగం. మీ పరికరానికి సంబంధించిన వెబ్‌స్టోరేజీ మరియు ఐడెంటిఫైయర్‌లతో సహా ఇతర టెక్నాలజీలను ఇదేవిధమైన ఉద్దేశ్యాల కొరకు ఉపయోగించుకోవచ్చు. ఈ పాలసీలో, ఇటువంటి అన్ని టెక్నాలజీలను మేము ‘‘కుకీలు’’ అని పిలుస్తాం.

మీరు Snapchat మరియు నిర్ధిష్ట ఇతర Snap Inc. సర్వీస్‌లను ఉపయోగించేటప్పుడు మీ నుంచి మరియు మీ గురించి సమాచారాన్ని మేము ఏవిధంగా సేకరిస్తాం మరియు ఉపయోగిస్తాం అనేది మా గోప్యతా విధానం వివరిస్తుంది. ఈ పాలసీ మేము కుకీలను ఎలా ఉపయోగిస్తాం మరియు మీ సంబంధిత ఎంపికల గురించి మరింత వివరిస్తుంది.

మేము కుకీలను ఎలా ఉపయోగిస్తాం

చాలామంది ఆన్‌లైన్ ప్రొవైడర్‌ల వలేనే, Snap Inc. మీ Snapchat డేటా మరియు అకౌంట్‌ని సంరక్షించడానికి, ఏ ఫీచర్లు అత్యంత ప్రజాదరణ కలిగి ఉన్నాయని మేము చూడటంలో సాయపడటానికి, ఒక పేజీకి సందర్శకుల సంఖ్యను లెక్కించడానికి, మా యూజ‌ర్‌ల అనుభవాన్ని మెరుగుపరచడానికి, మా సేవల్ని సురక్షితంగా ఉంచడానికి, సంబంధిత ప్రకటనలు అందించడానికి, మరియు మీకు మెరుగైన, మరింత ప్రత్యేకమైన, మరియు సంతృప్తికరమైన అనుభవాన్ని సాధారణంగా అందించడం వంటి అనేక కారణాల కొరకు తృతీయపక్ష కుకీలతో సహా అనేక కుకీలను ఉపయోగిస్తుంది. మేము సాధారణంగా ఉపయోగించే కుకీలు దిగువ పేర్కొన్న ఏదైనా ఒక కేటగిరీకి చెందుతాయి.

కుకీల కేటగిరీ మేము ఈ కుకీలను ఎందుకు ఉపయోగిస్తాం
అవసరం

మేము మా సైట్‌ని రన్ చేయడానికి, మరియు భద్రతా ప్రమాదాలను గుర్తించడానికి మరియు నిరోధించడానికి ఈ కుకీలను ఉపయోగిస్తాం.

ఉదాహరణకు, మీ యూజర్‌నేమ్ మరియు పాస్‌వర్డ్ లేకుండా మీ పాస్‌వర్డ్ మార్చకుండా ఇతరులను నిరోధించడానికి మీ సెషన్ సమాచారాన్ని స్టోరు చేయడం కొరకు మేము ఈ కుకీలను ఉపయోగించవచ్చు.

ప్రాధాన్యతలు

మీ సెట్టింగ్‌లు మరియు ప్రాధాన్యతలను గుర్తుంచుకోవడానికి, మరియు మా సైటుపై మీ అనుభవాన్ని మెరుగుపరచడానికి మేము ఈ కుకీలను ఉపయోగిస్తాం.

ఉదాహరణకు, మీ భాషా ప్రాధాన్యతలను గుర్తుంచుకోవడానికి మేము ఈ కుకీలను ఉపయోగించవచ్చు.

ప్రాధాన్యత

మీరు మా సైట్‌ని ఏవిధంగా ఉపయోగిస్తున్నారు, సైట్ ప్రాధాన్యతలను మానిటర్ చేయడం, మరియు మా సైటు పనితీరు, మా సర్వీస్‌లు మరియు మీ అనుభవం గురించిన సమాచారాన్ని సేకరించడానికి మేము ఈ కుకీలను ఉపయోగిస్తాం.

ఉదాహరణకు, మా యూజర్‌ల్లో ఈ ఫీచర్లలో ఏవి అత్యంత ప్రజాదరణ పొందాయి మరియు వేటిలో కొన్ని సర్దుబాట్లు అవసరం అవుతాయనే దాని గురించి తెలుసుకోవడానికి మేము ఈ కుకీలను ఉపయోగించవచ్చు.

మార్కెటింగ్
మా సేవలు మరియు ఇతర సైట్‌లు లేదా మొబైల్‌ యాప్‌లు రెండింటిపైనా ప్రకటనలు అందించడానికి, వాటిని వినియోగదారులకు మరింత సంబంధితంగా మరియు అర్ధవంతంగా చేయడానికి, మరియు మా ప్రకటనల క్యాంపైన్‌ని మరింత సమర్ధవంతంగా ట్రాక్ చేయడానికి మేము ఈ కుకీలను ఉపయోగిస్తాం. మా తృతీయపక్ష ప్రకటనల భాగస్వాములు

తృతీయపక్ష ప్రకటనల భాగస్వాములు:

×
  • Twitter
  • Pinterest
  • Google ఎనలిటిక్స్
  • LinkedIn
  • Bing
  • Pardot
మీ ఆసక్తుల యొక్క ప్రొఫైల్ రూపొందించడానికి మరియు ఇతర సైట్‌లపై సంబంధిత ప్రకటనలు అందించడానికి ఈ కుకీలను ఉపయోగించుకోవచ్చు.

అనలిటిక్స్ మరియు అడ్వర్టైజింగ్ సేవలు

ఇతరుల ద్వారా అందించబడేవి

మేము మా సేవల్లో ఇతర కంపెనీలను కుకీలు ఉపయోగించడానికి అనుమతించవచ్చు. ఈ కంపెనీలు మీరు కాలక్రమేణా మా సేవలను ఎలా ఉపయోగిస్తారనే దాని గురించి సమాచారాన్ని సేకరించి ఇతర సేవలు మరియు సంస్థల నుండి తీసుకున్న ఇలాంటి సమాచారంతో మిళితం చేయవచ్చు. ఇతర విషయాలతోపాటు ఈ సమాచారాన్ని డేటాను విశ్లేషించడానికి మరియు ట్రాక్ చేయడానికి, నిర్దిష్ట కంటెంట్ ప్రజాదరణను నిర్ణయించడానికి మరియు మీ ఆన్‌లైన్ కార్యాచరణను బాగా అర్థం చేసుకోవడానికి ఉపయోగించవచ్చు.

అదనంగా, మా అనుబంధ సంస్థలుతో సహా కొన్ని కంపెనీలు, ప్రకటనల పనితీరును కొలవడానికి మరియు తృతీయపక్ష వెబ్‌సైట్‌లు మరియు యాప్‌లతో సహా మా లేదా ఇతర సంస్థల తరపున మరింత సంబంధిత ప్రకటనలను అందించడానికి మా సేవల్లో సేకరించిన సమాచారాన్ని ఉపయోగించవచ్చు. ఆసక్తి-ఆధారిత ప్రకటనలు మరియు మీకు అందుబాటులో ఉన్న ఎంపికల గురించి మరింత సమాచారం కోసం, ఇక్కడికి వెళ్ళండి.

మా ద్వారా అందించబడేవి

మేము అందించిన కుకీలు ఉపయోగించే తృతీయపక్ష సేవలపై మీ కార్యాచరణ గురించిన సమాచారాన్ని సేకరించవచ్చు. ప్రకటనల పనితీరును కొలవడం మరియు మీకు మరింత సంబంధిత ప్రకటనలను చూపించడంతో సహా మా అడ్వర్టైజింగ్ సేవలను మెరుగుపరచడానికి మేము ఈ సమాచారాన్ని ఉపయోగిస్తాము. Snapchat అడ్వర్టైజింగ్ గురించి మరియు మీరు చూసే ప్రకటనలను ఎంచుకోవడానికి ఉపయోగించే సమాచారాన్ని మీరు ఎలా నియంత్రించవచ్చో తెలుసుకోవడానికి మా అడ్వర్టైజింగ్ ప్రాధాన్యతల పేజీని సందర్శించండి.

మీ ఎంపికలు

కొన్ని లేదా అన్ని బ్రౌజర్ కుకీలను తిరస్కరించే ఆప్షన్‌ని మీ బ్రౌజర్ మీకు అందించవచ్చు. మీ బ్రౌజర్ నుంచి కూడా మీరు కుకీలను తొలగించగలుగుతారు. బ్రౌజర్ కుకీలను ఏవిధంగా నిర్వహించాలనే దాని గురించి మరింత సమాచారం కొరకు, మీ బ్రౌజర్ ద్వారా అందించబడ్డ ఆదేశాలను దయచేసి పాటించండి.

బ్రౌజర్ కుకీలు

కొన్ని లేదా అన్ని బ్రౌజర్ కుకీలను తిరస్కరించే ఆప్షన్‌ని మీ బ్రౌజర్ మీకు అందించవచ్చు. మీ బ్రౌజర్ నుంచి కూడా మీరు కుకీలను తొలగించగలుగుతారు. బ్రౌజర్ కుకీలను ఏవిధంగా నిర్వహించాలనే దాని గురించి మరింత సమాచారం కొరకు, మీ బ్రౌజర్ ద్వారా అందించబడ్డ ఆదేశాలను దయచేసి పాటించండి.

మొబైల్ పరికరం ఐడెంటిఫైయర్‌లు

ఆసక్తి ఆధారిత ప్రకటనల కొరకు ఉపయోగించే నిర్ధిష్ట పరికరం ఐడెంటిఫైయర్‌లు వద్దని మీరు ఎంచుకునేందుకు మీ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ మీకు అవకాశం కల్పించవచ్చు. మీ మొబైల్ పరికరం తయారీదారుడి ద్వారా అందించబడే సూచలను మీరు రిఫర్ చేయాలి, ఈ సమాచారం సాధారణంగా మీ మొబైల్ పరికరం యొక్క ‘‘సెట్టింగ్‌లు’’ విధి కింద లభ్యమవుతుంది.

మరియు, ఒకవేళ మొబైల్ పరికరం అన్‌ఇన్‌స్టాల్ ప్రక్రియను అందిస్తున్నట్లయితే, Snapchat యాప్‌ని అన్ఇన్‌స్టాల్ చేయడం ద్వారా యాప్‌ ద్వారా సమాచారం సేకరించడం నుంచి కూడా మీరు ఎల్లప్పుడూ మమ్మల్ని ఆపవచ్చు.

మీ సెట్టింగ్‌లు మార్చండి

మా సైట్‌లపై మీ సెట్టింగ్‌లను సర్దుబాటు చేయడం ద్వారా కూడా మీరు నిర్ధిష్ట కుకీలను బ్లాక్ చేయవచ్చు.